GST: వర్మ 'జీఎస్టీ' చాలా కాస్ట్... చూడాలంటే రూ. 150 కట్టాల్సిందే!

  • రేపు ఆన్ లైన్ లో విడుదల కానున్న జీఎస్టీ
  • చిత్రాన్ని నిర్మించిన స్ట్రయిక్ ఫోర్స్
  • ట్వీట్ ద్వారా తెలిపిన రాంగోపాల్ వర్మ

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రేపు ఉదయం ఆన్ లైన్ మాధ్యమంలో విడుదల చేయనున్నట్టు ప్రకటించిన జీఎస్టీ (గాడ్, సెక్స్ అండ్ ట్రూత్) సినిమాను చూడాలంటే, డబ్బులు కట్టాల్సిందే. ఈ విషయాన్ని వర్మ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు. దీన్ని నిర్మించిన యూఎస్ సంస్థ స్ట్రయిక్ ఫోర్స్ వీడియోను చూసేందుకు డబ్బు వసూలు చేస్తుందని తెలిపారు.

అమెరికా, కెనడాలో అయితే 2.99 డాలర్లు చెల్లించాలని, యూరప్ లో 1.99 పౌండ్లు కట్టాలని చెప్పాడు. ఇండియాలో సినిమా చూసేవాళ్లు రూ. 150 చెల్లించాలని, శ్రీలంకలో అయితే రూ. 200 కట్టాల్సి వుంటుందని ట్వీట్ చేశాడు. ఈ చిత్రంలో పోర్న్ స్టార్ మియా మాల్కోవా నటించగా, ట్రైలర్ పెను సంచలనాన్నే రేపిన సంగతి తెలిసిందే. దీనికి ఎంఎం కీరవాణి నేపథ్య సంగీతాన్ని అందించారు.

GST
Ramgopal Varma
God S*x and Truth
  • Error fetching data: Network response was not ok

More Telugu News