Narendra Modi: దావోస్ లో మోదీ వ్యాఖ్యలపై చైనా స్పందన!

  • అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక ఆత్మరక్షణ ధోరణులు పెరుగుతున్నాయన్న మోదీ
  • ఆ వ్యాఖ్యలను సమర్థించిన చైనా
  • ఈ తరహా విధానాలపై రెండు దేశాలు కలిసి పోరాడాలి : చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి

అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్థిక ఆత్మరక్షణ ధోరణులు పెరుగుతున్నాయంటూ దావోస్ లోని ప్రపంచ ఆర్థిక వేత్తల సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై చైనా స్పందించింది. ఈ వ్యాఖ్యలను సమర్థిస్తున్నట్టు చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చున్ ఇంగ్ పేర్కొన్నారు. ఆర్థిక ఆత్మరక్షణ ధోరణిపై పోరాటం విషయంలోనూ, ప్రపంచీకరణను ప్రోత్సహించే విషయంలోనూ భారత్ - చైనాలకు ఒకే రకమైన ఆసక్తి ఉందని అన్నారు.

ఈ తరహా విధానాలపై రెండు దేశాలు కలిసి పోరాడాలని, భారత్ తో మంచి ద్వైపాక్షిక సంబంధాలను కొనసాగించాలని తాము ఆశిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, అమెరికా అనుసరిస్తున్న ‘అమెరికా ఫస్ట్’ విధానానికి మోదీ తన ప్రసంగంలో పరోక్షంగా చురకలు వేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో స్వార్థం పెరుగుతోందని, ఆర్థిక ఆత్మరక్షణ ధోరణులు పెరుగుతున్నాయని అన్నారు.  

  • Loading...

More Telugu News