Pawan Kalyan: నేను సీఎం రేసులో లేను .. పవన్ కల్యాణ్ పాపం పసివాడు!: రేణుకాచౌదరి

  • 2019లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తా
  • అన్ని నియోజకవర్గాల్లో మేము గెలుస్తాం
  • సీఎం పదవిపై నాకు ఆశ లేదు
  • ‘కాంగ్రెస్’లో ప్రతికార్యకర్త సీఎం అభ్యర్థే: మీడియాతో రేణుకా చౌదరి

2019 ఎన్నికల్లో ఖమ్మం జిల్లాలో పార్టీని ముందుండి నడిపిస్తానని, ఎవరు అడ్డొస్తారో చూస్తానని, జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తాము గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రేణుకాచౌదరి అన్నారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, సీఎం రేసులో తాను లేనని, ఆ ఆశ కూడా తనకు లేదని, కాంగ్రెస్ పార్టీలో ప్రతి కార్యకర్త సీఎం అభ్యర్థేనని అన్నారు.

ఈ సందర్భంగా టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ మాటల ప్రభుత్వం తప్ప, చేతల ప్రభుత్వం కాదని విమర్శించారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పైనా ఆమె వ్యాఖ్యలు చేశారు. ‘రాజకీయాల్లో పవన్ కల్యాణ్ పాపం పసివాడు!’గా రేణుకాచౌదరి అభివర్ణించారు.

Pawan Kalyan
Congress
renuka choudary
  • Loading...

More Telugu News