anushka: 'భాగమతి' సెకండాఫ్ ఒక రేంజ్ లో వుంటుందట!

  • భారీ బడ్జెట్ తో నిర్మాణం 
  • ఈ నెల 26వ తేదీన విడుదల
  • కేరళలో 150 స్క్రీన్లలో విడుదల

అనుష్క ప్రధానమైన పాత్రను పోషించిన సినిమాలు చాలా వరకూ విజయాలనే సాధించాయి. ఆమె కీర్తి కిరీటంలో కలికితురాయిలా నిలిచాయి. ఆ స్థాయి సినిమానే అన్నట్టుగా అశోక్ దర్శకత్వంలో 'భాగమతి' సినిమా తెరకెక్కింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. ఫస్టులుక్ నుంచి టీజర్ వరకూ ఈ సినిమా అంచనాలు పెంచుతూ వచ్చింది.

 ఈ సినిమా ఫస్టాఫ్ సరదాగా సాగుతుందనీ, సెకండాఫ్ లో కీలకమైన పాత్రలు వచ్చి చేరతాయని అంటున్నారు. 'భాగమతి'గా అనుష్క మరో పాత్ర కూడా సెకండాఫ్ లోనే వస్తుందని చెబుతున్నారు. ఈ కారణంగా సెకండాఫ్ ఉత్కంఠభరితంగా కొనసాగుతుందనీ .. ప్రేక్షకులను కట్టిపడేస్తుందని అంటున్నారు. కేరళలో ఈ సినిమాను 150 స్క్రీన్లలో విడుదల చేస్తుండటం విశేషం. ఈ నెల 26వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా కోసం అనుష్క అభిమానులంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.  

  • Loading...

More Telugu News