bullet train: 2023 నాటికి దేశంలో తొలి బుల్లెట్ రైలు రెడీ!

  • జపాన్ దేశ కాన్సుల్ జనరల్ నోడా ప్రకటన
  • షింజో అబే భారత పర్యటనతో బలపడిన బంధం
  • జపాన్ ను సందర్శించే భారతీయులు తక్కువే

దేశంలో తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టు మరో నాలుగేళ్లలో పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముంబై, అహ్మదాబాద్ నగరాల మధ్య చేపట్టిన ఈ రైలు ప్రాజెక్టు నిర్మాణం 2023 నాటికి పూర్తి కావాలని జపాన్ దేశ కాన్సుల్ జనరల్ ర్యోజినోడా అన్నారు. భారత్, జపాన్ రెండూ కూడా అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వాములు అని గుర్తు చేశారు. గతేడాది సెప్టెంబర్ లో జపాన్ ప్రధాని షింజో అబే గుజరాత్ లో పర్యటించిన తర్వాత ఈ బంధం మరింత బలపడిందన్నారు.

‘‘గతేడాది సెప్టెంబర్ లో షింజో అబే, నరేంద్ర మోదీ హై స్పీడ్ రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. అహ్మదాబాద్, ముంబై నగరాలను కేవలం రెండు గంటల వ్యవధిలో ఇది అనుసంధానించగలదు. ఈ ప్రాజెక్టును 2023 నాటికి పూర్తి చేయాలి’’ అని నోడా పేర్కొన్నారు. జపాన్ ను పర్యాటక ప్రదేశంగా భారతీయుల్లో ప్రచారం చేస్తున్నామని, అయినా తమ దేశానికి వచ్చే భారతీయులు చైనీయుల కంటే తక్కువ అని తెలిపారు.

bullet train
highspeed rail
  • Loading...

More Telugu News