anushka: చేతిలో సినిమాల్లేవని తేల్చి చెప్పిన అనుష్క!

  • విడుదలకి సిద్ధంగా 'భాగమతి'
  • ప్రమోషన్స్ లో ఆమె బిజీ  
  • కథలేవీ వినడం లేదన్న అనుష్క  

తెలుగు, తమిళ భాషల్లో అనుష్క అగ్రకథానాయికగా వెలుగొందుతూ వస్తోంది. అందానికి .. అభినయానికి అసలైన అర్థం అనుష్క అనే విషయాన్ని తోటి హీరోయిన్స్ కూడా ఒప్పుకుంటారు. అలాంటి అనుష్క తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'భాగమతి' సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వూలో అనుష్క మాట్లాడింది.

 'భాగమతి' తరువాత తాను ఏ సినిమాను అంగీకరించలేదని ఆమె చెప్పింది. కథా చర్చలు కూడా ఏమీ జరగడం లేదని అంది. ఇలా ప్రస్తుతానికి తన చేతిలో సినిమాలేవీ లేవనే విషయాన్ని ఆమె స్పష్టం చేసింది. చేస్తే అనుష్క సీనియర్ హీరోల సరసనే చేయాలి .. లేదంటే కథానాయిక ప్రాధాన్యత గల సినిమాలే చేయాలి. ఆమె సంపాదించుకున్న క్రేజ్ అందుకు ఒక కారణమైతే .. బరువు తగ్గకపోవడం మరో కారణమని చెప్పుకుంటున్నారు. ఇక 'భాగమతి' కూడా అనుష్క ఖాతాలో సూపర్ హిట్ ను జమచేస్తుందేమో చూడాలి.   

  • Loading...

More Telugu News