student: లీవ్ కావాలంటూ.. తరగతి గదిలో ఆ విద్యార్థి పాడిన పాట వైరల్.. మీరూ చూడండి!

  • తనకు సెలవు కావాల‌ని త‌మ టీచ‌ర్ ముందు పాట
  • సెలవు చీటీలోని విషయాన్నే పాటకు సాహిత్యంగా చేసుకున్న వైనం
  • పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని ఘోర్వాలా ప్రైమరీ స్కూల్లో ఘటన

పాఠ‌శాల‌లో ఓ విద్యార్థి తనకు సెలవు కావాల‌ని త‌మ టీచ‌ర్ ముందు పాట పాడిన ఘ‌ట‌న‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. సెల‌వు చీటీని ఆ విద్యార్థి పాట రూపంలో పాడి వినిపించారు. తనకు ఆరోగ్యం బాగోలేదని, విశ్రాంతి తీసుకోవాల్సి ఉంద‌ని, కాబట్టి ఒకరోజు సెలవు ఇవ్వాలని కోరాడు. సెల‌వు చీటిలో రాసే ఫుల్‌స్టాప్‌లు, కామాలను కూడా పాటలో భాగంగానే వినిపించాడు. ఈ వీడియో చూస్తోన్న నెటిజ‌న్లు సరదాగా తమాషా కామెంట్లు గుప్పిస్తున్నారు. పాకిస్థాన్ ఇస్లామాబాద్‌లోని ఘోర్వాలా ప్రైమరీ స్కూల్లో జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌ను మీరూ చూడండి...

  • Loading...

More Telugu News