Tollywood: కృష్ణ కంటి రక్తపు బిందువు నుంచి పుట్టిందే ‘కృష్ణ సేన’!: ఘట్టమనేని ఆదిశేషగిరిరావు

  • నాడు నంద్యాల టీడీపీ కార్యాలయం నుంచి రాళ్లు విసిరితే కృష్ణ కంటికి గాయమైంది
  • ఈ సంఘటన నేపథ్యంలో ఏర్పడిందే ‘కృష్ణ సేన’
  • ఆ తర్వాత ‘కృష్ణ - మహేశ్ సేన’గా మారింది
  • నాటి దాడిని టీడీపీ ఖండించలేదు: ఆదిశేషగిరిరావు విమర్శలు

ప్రముఖ సినీనటుడు కృష్ణ కంటి రక్తపు బిందువు నుంచి ‘కృష్ణ సేన’ అనే ఆర్గనైజేషన్ 1984లో పుట్టిందని వైసీపీ అధినేత, ఆయన సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు అన్నారు. ‘ఐ డ్రీమ్స్’ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ‘1984లో రాయలసీమలో ఎన్నికల ప్రచారానికి ఆయన (కృష్ణ) వెళ్లారు. కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడి వస్తున్నారు. ఆ సమయంలో టీడీపీ పార్టీ కార్యాలయం మేడపై నుంచి రాళ్లు వేయడంతో ఆయన (కృష్ణ) కంటికి దెబ్బతగిలి రక్తం వచ్చింది.

వెంటనే, కర్నూలు ఆసుపత్రిలో దెబ్బ తగిలిన కంటికి ఆపరేషన్ చేయించుకుని, హైదరాబాద్ వచ్చారు. ఈ సంఘటనను తెలుగుదేశం పార్టీ వాళ్లు అధికారికంగా ఇంతవరకూ ఎవరూ ఖండించలేదు. మేడపై ఉన్న టీడీపీ ఆఫీసు నుంచి వచ్చి రాళ్లు పడ్డాయి. దుండగులెవరూ ఈ రాళ్లు విసరలేదు. ఈ సంఘటన నేపథ్యంలో పుట్టిందే ‘కృష్ణసేన’.

కృష్ణ కు రక్షణగా మొదలైన సేన ఇది. ఈ సేన ఎప్పుడూ టీడీపీకి వ్యతిరేకమే. ‘కృష్ణసేన’లో దాదాపు మూడు లక్షల మంది సభ్యులు ఉన్నారు. మహేశ్ బాబు ఎదిగే క్రమంలో అతనికి కూడా ఈ సేన మద్దతు ఇస్తూ ‘కృష్ణ - మహేశ్ సేన’గా మారింది. దీనికి అప్పటి నుంచి నేను గౌరవాధ్యక్షుడిని. ‘కృష్ణ - మహేశ్ సేన’ రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్. కాంగ్రెస్ పార్టీకి ఈ సేన మద్దతుగా ఉండేది. మొన్నీ మధ్య వైసీపీకి మద్దతు ఇచ్చింది’ అని చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News