New Delhi: రాహుల్‌ గాంధీతో ఏపీసీసీ చీఫ్‌ రఘువీరారెడ్డి భేటీ

  • ఢిల్లీకి వెళ్లిన ఏపీసీసీ బృందం
  • ఇందిరా గాంధీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను నిర్వహించిన తీరుపై రాహుల్‌కి వివరణ 
  • పోల‌వ‌రం విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును చెప్పిన ఏపీసీసీ
  • తాము నిర్వ‌హించిన మ‌హా పాద‌యాత్ర గురించి కూడా రాహుల్‌కి వివరణ

ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీతో ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఆధ్వ‌ర్యంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కుల‌ బృందం ఈ రోజు ఢిల్లీలో భేటీ అయింది. ఏపీ రాజకీయాలపై రాహుల్‌ గాంధీతో వీరు చర్చించారు. ఇందిరా గాంధీ శ‌త‌జ‌యంతి ఉత్స‌వాల‌ను ఏపీలో తాము నిర్వ‌హించిన తీరును రాహుల్ గాంధీకి వివ‌రించిన ర‌ఘువీరారెడ్డి.. అదే విధంగా పోల‌వ‌రం విష‌యంలో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాల తీరును, ఈ నెల‌లో తాము నిర్వ‌హించిన మ‌హా పాద‌యాత్ర గురించి వివ‌రించారు.

విభజన చట్టంలోని హామీల అమలు కోసం పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు. అనంత‌రం మీడియాతో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ పార్టీలు రాష్ట్ర ప్ర‌యోజ‌న‌లను గాలికి వ‌ద‌లి అసెంబ్లీ సీట్ల పెంపు క‌చ్చితంగా జ‌రిగి తీరుతుంద‌ని చెప్ప‌డం వెన‌క ఎవ‌రి ప్ర‌యోజ‌నాలు ఉన్నాయని ప్రశ్నించారు.   

  • Loading...

More Telugu News