jail: కాసేపట్లో జైలు నుంచి విడుదల కానున్న మంద కృష్ణ మాదిగ

  • ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతోన్న మందకృష్ణ మాదిగ
  • అనుమతి లేకుండా దీక్షకు దిగినందుకు రిమాండ్ 
  • కోర్టులో బెయిల్ మంజూరు

అనుమతి లేకుండా దీక్షకు దిగినందుకు గానూ ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగను కొన్ని రోజుల క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అలాగే, ఆయన చేసిన ప్రసంగాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని పలు సెక్షన్ల కింద కేసులు కూడా నమోదయ్యాయి.

 కాగా, చంచల్ గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంటోన్న ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయనను జైలు నుంచి కాసేపట్లో విడుదల చేయనున్నారు. ఎస్సీ వర్గీకరణ కోరుతూ మంద కృష్ణ మాదిగ పోరాడుతున్నారు. ఇటీవల ఆ ఉద్యమాన్ని ముమ్మరం చేశారు. 

jail
manda krishna madiga
release
  • Loading...

More Telugu News