Asaduddin Owaisi: వీరి అకౌంట్లోకి కనీసం రూ. 15 వేలు అయినా వేయండి: మోదీపై ఒవైసీ విమర్శలు

  • న్యాయం పేరుతో 'షరియత్' చట్టంలోకి తల దూరుస్తున్నారు
  • ట్రిపుల్ తలాక్ బాధితులకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
  • బాధితులకు రూ. 15 వేలు ఇవ్వాలి

న్యాయం పేరుతో ఇస్లామిక్ చట్టం 'షరియత్'ను ప్రధాని మోదీ లక్ష్యంగా చేసుకుంటున్నారని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ లో జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, ట్రిపుల్ తలాక్ విషయాన్ని బీజేపీ నేతలు తమ స్వార్థ లాభాల కోసం వినియోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

ఎన్నికల ముందు ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరి బ్యాంక్ అకౌంట్లలో రూ. 15 లక్షలు వేస్తామని తప్పుడు హామీలు ఇచ్చారని... ఆ డబ్బు వేయకపోయినా, కనీసం ట్రిపుల్ తలాక్ బాధితుల అకౌంట్లలోకి రూ. 15 వేలు అయినా వేయాలని ఎద్దేవా చేశారు. దీనికోసం బడ్జెట్ లో ప్రత్యేక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లు లోక్ సభ ఆమోదం పొందినప్పటికీ, రాజ్యసభలో మాత్రం మద్దతును కూడగట్టలేకపోయిన సంగతి తెలిసిందే. 

Asaduddin Owaisi
Narendra Modi
triple talak
  • Loading...

More Telugu News