Drunken Drive: డ్రంకెన్ డ్రైవ్ తప్పించుకునేందుకు మరో వినూత్న ప్లాన్... తలపట్టుకున్న పోలీసులు... వీడియో చూడండి!

  • చక్కగా బైకులు దిగి నడిపించుకు వెళ్లిన మందుబాబులు
  • వారిపై కేసు ఎలా పెట్టాలో తెలియని స్థితిలో పోలీసులు
  • వైరల్ అవుతున్న వీడియో

 పోలీసులు నిర్వహించే డ్రంకెన్ డ్రైవ్ లో తప్పించుకునేందుకు గత వారంలో వాలెట్ డ్రైవర్లను వాడిన మందుబాబులు, ఇప్పుడు మరో ప్లాన్ వేశారు. మందుబాబులు అమలు చేసిన ఈ ప్లాన్ తో వారిని ఎలా బుక్ చేయాలో తెలియక పోలీసులు తల పట్టుకుంటున్నారు.

అసలింతకీ ఏం జరిగిందంటే... దగ్గర్లో బార్ ఉందో ఏమో... చుక్కేసి బైకులెక్కిన వారికి, మూల మలుపులో పోలీసులు డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తూ కనిపించారు. ఇంకేముంది, ప్రతి ఒక్కరూ చక్కగా బండి దిగేసి, వాటిని నెట్టుకుంటూ పోలీసుల ముందు నుంచి వెళ్లిపోయారు. వాళ్లు మందేశారని తెలిసినా, బండిని నడుపుకుంటూ వెళుతున్నారు కాబట్టి పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి.

అలా ఒకరు, ఇద్దరూ కాదు... వందల మంది ఇలా బండి నడిపించుకుంటూ వెళ్లిపోయారు. ఈ వీడియో ఎప్పుడు, ఎక్కడ తీశారో తెలియదుగానీ, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరిని బుక్ చేయాలంటే మద్యం తాగి, బండిని నడిపించుకుని కూడా వెళ్లకూడదన్న చట్టం తేవాలేమో? ఆ వీడియోను మీరూ చూడవచ్చు.

Drunken Drive
Police
Walking
  • Error fetching data: Network response was not ok

More Telugu News