Amma Bike: సగం రేటుకు 'అమ్మ బైక్'... నిబంధనలు చూసి అమ్మాయిల ఆగ్రహం!
- జయలలిత జయంతి సందర్భంగా సగం ధరకే బైకులు
- లైసెన్స్ కలిగి వుండాలన్న నిబంధన అడ్డు
- బండిలేని తాము లైసెన్స్ ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు

ఫిబ్రవరి 5 వరకూ దరఖాస్తులను అధికారులు తీసుకోనుండగా, ప్రతి జిల్లా, మండలాల్లో దరఖాస్తులు స్వీకరించే శిబిరాలు ఏర్పాటయ్యాయి. అయితే, దరఖాస్తు చేసుకునే అమ్మాయికి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలన్న నిబంధన పలువురి ఆగ్రహానికి కారణమైంది. దీనికితోడు ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్నట్టు సర్టిఫికెట్, 40 ఏళ్లలోపు వయసున్నట్టు ధ్రువీకరణను అధికారులు అడుగుతున్నారు. బండ్లే లేని తాము డ్రైవింగ్ లైసెన్సులు ఎందుకు తీసుకుంటామని ప్రశ్నిస్తున్న అమ్మాయిలు, అసలు బైకులను ఎవరికి ఇవ్వాలని చూస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.