vijaya shanthi: పవన్ కల్యాణ్ యాత్ర సందర్భంగా కేసీఆర్ ను నిలదీసిన విజయశాంతి!

  • సకల జనుల సర్వే సమయంలో పవన్‌‌ కల్యాణ్‌‌ ను కేసీఆర్ టూరిస్ట్ అన్నారు
  • ఆయన తెలంగాణ యాత్రకు కేసీఆర్ వీసా ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాలి
  • టూరిస్ట్ నేతకు ఇచ్చిన స్వేచ్ఛ ఉద్యమనేతలకు ఇవ్వకపోవడం దారుణం

 జనసేనాని పవన్‌ కల్యాణ్ కొండగట్టు ఆంజనేయస్వామి సాక్షిగా రాజకీయ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రముఖ సినీనటి, కాంగ్రెస్ నేత విజయశాంతి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా హైదరాబాదులో ఆమె మాట్లాడుతూ, సకల జనుల సర్వే సమయంలో పవన్‌‌ కల్యాణ్‌‌ ను 'టూరిస్ట్' అంటూ కామెంట్ చేసిన కేసీఆర్... ఆయన తెలంగాణ యాత్రకు ఇప్పుడు వీసా ఎలా జారీ చేశారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

పవన్‌ కల్యాణ్ లాంటి టూరిస్ట్‌ నేతకు ఇచ్చిన స్వేచ్ఛ ఉద్యమ నేతలకు ఇవ్వకపోవడం శోచనీయమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వారై, తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమ, జేఏసీ నేతలకు కూడా పవన్‌ కల్యాణ్ మాదిరిగా వీసాలిస్తే వారికి కనీసం తెలంగాణలో ఉన్నామన్న భావన కలుగుతుందని ఆమె సూచించారు. జేఏసీ నేతలను నిర్బంధించే తీరును చూస్తుంటే తెలంగాణ బిడ్డల పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో తెలుస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

vijaya shanthi
Telangana
politics
comments
  • Loading...

More Telugu News