kuddapah: ‘బ్రహ్మణి స్టీల్స్’కి చెందిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలు సీజ్!
- రూ.189 కోట్ల విలువ చేసే యంత్రాలను సీజ్ చేసిన డీఆర్ఐ
- 2009 లో విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ‘బ్రహ్మణి స్టీల్స్’
- నాటి నుంచి వీటిని వినియోగించని వైనం
కడప జిల్లాలోని జమ్మలమడుగులో బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ (బ్రహ్మణి స్టీల్స్) కు సంబంధించిన కోట్ల రూపాయల విలువ చేసే యంత్రాలను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) సీజ్ చేసింది. ఈ యంత్రాలను కొన్నేళ్ల క్రితం విదేశాల నుంచి సదరు సంస్థ దిగుమతి చేసుకుంది. అప్పటి నుంచి వీటిని వినియోగించలేదు. డీఆర్ఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో రూ.189 కోట్ల విలువ చేసే ఈ యంత్రాలను డీఆర్ఐ సీజ్ చేసినట్టు సమాచారం.
2009లో ఈ యంత్రాలను విదేశాల నుంచి ‘బ్రహ్మణి స్టీల్స్’ దిగుమతి చేసుకుంది. కాగా, వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో గాలి జనార్దన్ రెడ్డికి చెందిన బ్రహ్మణి స్టీల్స్ కు భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేశారు. అయితే, నిర్మాణ విషయంలో నిబంధనలు పాటించకపోవడంతో సదరు సంస్థకు కేటాయించిన భూకేటాయింపు జీవోను ఆ తర్వాత రద్దు చేయడం జరిగింది.