Virat Kohli: అప్పటి వరకు కోహ్లీ గొప్ప ఆటగాడు కాదు: మైఖేల్ హోల్డింగ్స్

  • ఇంగ్లాండ్ గడ్డపై రాణించి కోహ్లీ నిరూపించుకోవాలి
  • 2014లో 10 ఇన్నింగ్స్ లలో కోహ్లీ సగటు 13.4 
  • జూన్ లో ఇంగ్లాండ్ లో పర్యటించనున్న టీమిండియా
  • ఈ సిరీస్ లో కోహ్లీ రాణించి నిరూపించుకోవాలి

ఐసీసీ బెస్ట్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ తో పాటు వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డును కైవసం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వరల్డ్ బెస్ట్ బ్యాట్స్ మన్ గా నీరాజనాలు అందుకుంటున్నాడు. అయితే సొంత గడ్డపై పరుగుల వరద పారించే కోహ్లీ ఇంగ్లాండ్‌ గడ్డపై రాణించి, గొప్ప బ్యాట్స్‌ మెన్‌ అనిపించుకోవాలని సవాలు విసిరాడు, వెస్టిండీస్ దిగ్గజ మాజీ బౌలర్ మైఖేల్ హోల్డింగ్స్.

 తాజాగా హోల్డింగ్స్ మాట్లాడుతూ, కోహ్లీ అద్భుతమైన ఆటగాడనడంలో ఎలాంటి సందేహం లేదని, తనను ఎవరైనా టాప్‌-3 క్రికెటర్లు ఎవరని అడిగితే ఆ లిస్టులో కోహ్లీ పేరు కూడా తప్పకుండా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. అయితే, కోహ్లీ ఇంగ్లాండ్‌ గడ్డపై పరుగులు సాధించినప్పుడే గొప్ప ఆటగాడు అని ఒప్పుకొంటానని ఆయన స్పష్టం చేశారు.

 కాగా, 2014లో భారత జట్టు ఇంగ్లాండ్‌ లో పర్యటించింది. ఈ పర్యటనలో కోహ్లీ ఆడిన 10 ఇన్నింగ్స్‌ లలో కలిపి 13.4 శాతం సగటుతో పరుగులు సాధించాడు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది జూన్ లో ఇంగ్లాండ్‌ గడ్డపై టీమిండియా పర్యటించనుంది. ఈ సిరీస్ లో కోహ్లీ తనను తాను నిరూపించుకోవాలని ఆయన సూచించారు.

  • Loading...

More Telugu News