Pawan Kalyan: జనసేన సినిమా విడుదల కాకముందే ఫెయిల్‌ అయింది: బీజేపీ నేత కృష్ణ సాగర్ రావు

  • జనసేనకు పార్టీ లోగో, జెండా ఉన్నాయి కానీ, కార్యవర్గం లేదు
  • పవన్ కల్యాణ్‌ తెలంగాణ వ్యతిరేకి
  • జనసేనలో కార్యకర్తలు లేరు
  • కేవలం తన ఫ్యాన్స్ తోనే పవన్ హంగామా

రాజకీయ యాత్ర‌ను ప్రారంభించ‌బోతోన్న జ‌న‌సేన అధినేత‌, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్‌పై పలువురు నేత‌లు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. జనసేనకు పార్టీ లోగో, జెండా ఉన్నాయి కానీ, కార్యవర్గం లేదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు విమర్శించారు. జనసేనను సినిమాతో పోల్చిన ఆయ‌న‌.. అది విడుదల కాకముందే ఫెయిల్‌ అయిందని ఎద్దేవా చేశారు. పవన్ కల్యాణ్‌ను తెలంగాణ వ్యతిరేకిగా ఆయన అభివర్ణించారు.

తెలంగాణలో అధికార పార్టీ వ్యతిరేక ఓటును చీల్చడానికి టీఆర్‌ఎస్ పవన్ కల్యాణ్‌ను ఓ అస్త్రంలా ప్రయోగిస్తుందని జోస్యం చెప్పారు. జనసేనలో కార్యకర్తలు లేరని, కేవలం తన ఫ్యాన్స్ తోనే పవన్ కల్యాణ్ హడావిడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నా ఆ విషయమై పవన్ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.  

Pawan Kalyan
Jana Sena
krishna sagar rai
BJP
  • Loading...

More Telugu News