aravind kejriwal: దేవుడికి అంతా ముందే తెలుసు.. 20 మంది ఎమ్మెల్యేల అనర్హతపై పెదవి విప్పిన కేజ్రీవాల్!

  • మూడేళ్ల తర్వాత 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని దేవుడికి ముందే తెలుసు
  • అందుకే అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలుపొందే విధంగా చేశాడు
  • మా ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించారు

ఢిల్లీలోని అధికార ఆప్ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలు అనర్హతకు గురికావడం పట్ల ఆ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేవుడికి అంతా తెలుసని, మూడేళ్ల తర్వాత 20 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుందని ఆయనకు ముందే తెలుసని ఆయన చెప్పారు. అందుకే అసెంబ్లీలో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలుపొందే విధంగా చేశాడని ఆయన చమత్కరించారు.

తమపై కొంతమంది కుట్రలు పన్ని తమ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు బనాయించినా అనుకున్నది సాధించలేకపోయారని, ఆ తరువాత తనపై సీబీఐ దాడులు కూడా చేయించి నప్పటికీ వారికి ఫలితం దక్కలేదని అన్నారు. వారి ప్రణాళికలేవీ ఫలించడం లేదని ఆందోళన చెందిన కుట్రదారులు... తమ పార్టీకి చెందిన 20 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 

aravind kejriwal
delhi
BJP
  • Loading...

More Telugu News