harsha vardhan: కేంద్రమంత్రి హర్షవర్ధన్ ను కలిసిన మంత్రి కామినేని

  • కొల్లేరు కాంటూరు తగ్గింపుపై చర్చ
  • నిర్వాసితులకు భూములు ఇవ్వాలంటూ విన్నపం
  • ఫిబ్రవరిలో పెలికాన్ ఫెస్టివల్

కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి హర్షవర్ధన్ ను ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ కలిశారు. ఈ సందర్భంగా కొల్లేరులో కాంటూరును తగ్గించే అంశాన్ని కేంద్ర మంత్రికి కామినేని వివరించారు. దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలను పర్యాటక కార్యదర్శులకు వివరించాలని కామినేనికి హర్షవర్ధన్ సూచించారు.

అనంతరం మీడియాతో కామినేని మాట్లాడుతూ కాంటూరు తగ్గింపు అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందని చెప్పారు. నిర్వాసితులకు భూములు ఇచ్చేందుకు కూడా సహకరించాలని కేంద్రమంత్రిని కోరానని తెలిపారు. కైకలూరు అటపాకలో ఫిబ్రవరిలో పెలికాన్ ఫెస్టివల్ జరుగుతుందని కామినేని అన్నారు.

harsha vardhan
kamineni srinivas
  • Loading...

More Telugu News