Puri Jagannadh: 'నా జీవితంలో ఇదే అతిపెద్ద కాంప్లిమెంట్'... అంటూ వర్మకు పూరి థ్యాంక్స్!

  • కుమారుడిని హీరోగా పెట్టి 'మెహబూబా' తీస్తున్న పూరీ
  • కొన్ని సీన్స్ చూసి స్పందించిన రాంగోపాల్ వర్మ
  • దీని ముందు 'పోకిరి' ఫ్లాప్ చిత్రమంటూ పొగడ్తలు

ప్రస్తుతం తన కుమారుడు ఆకాష్ ను హీరోగా పెట్టి 'మెహబూబా' పేరిట ఓ సినిమాను దర్శకుడు పూరీ జగన్నాథ్ రూపొందిస్తున్న సంగతి విదితమే. కాగా, ఈ చిత్రంలోని కొన్ని సీన్స్ చూసిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్‌ వర్మ ఫిదా అయ్యాడట. ఈ సినిమాను సూపర్ హిట్ మూవీ 'పోకిరి'తో పోల్చుతూ, 'మెహబూబా'తో పోల్చితే, 'పోకిరి' ఫ్లాప్ అంటూ తనదైన శైలిలో పొగడ్తలు గుప్పించాడట.

కుమారుడిపై ప్రేమతో ఎంతో అందంగా సినిమాను పూరీ తెరకెక్కించాడని, ఇదో అందమైన కావ్యమని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు. ఇక తన గురువు పొగడ్తలకు పూరీ సైతం ఆనందించాడు. "తొలిసారిగా నేను ఓ ఫిల్మ్ మేకర్ నని నా బాస్ అంగీకరించారు. నా జీవితంలో అందిన అతిపెద్ద కాంప్లిమెంట్ ఇదే. లవ్ యూ సర్" అని మెసేజ్ పెట్టాడు.

Puri Jagannadh
Ramgopal Varma
Mehabooba
Akash
  • Error fetching data: Network response was not ok

More Telugu News