women rights: అనుమతి లేకుండా మహిళను తాకడానికి వీల్లేదు: ఢిల్లీ కోర్టు
- మహిళ శరీరం ఆమె సొంతం
- వారికి వ్యక్తిగత గోప్యత హక్కు ఉంది
- ఆ హక్కును పురుషులు కాలరాస్తున్నారు
మహిళలకు సంబంధించి ఢిల్లీ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మహిళ శరీరం ఆమె సొంతమని... ఆమె శరీరంపై ఆమెకు ప్రత్యేక హక్కులు ఉన్నాయని తెలిపింది. ఆమె అనుమతి లేకుండా ఆమె శరీరాన్ని తాకే హక్కు ఎవరికీ లేదని చెప్పింది. 2014లో ఢిల్లీలోని ముఖర్జీ నగర్ లో తొమ్మిదేళ్ల బాలికపై అసభ్య రీతిలో ప్రవర్తించిన ఉత్తరప్రదేశ్ వాసి రామ్ కేసును విచారించిన సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది.
రామ్ వ్యవహరించిన తీరు లైంగిక వేధింపుల కిందకే వస్తుందని తెలిపింది. నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ. 10 వేల జరిమానా విధించింది. జరిమానాలో రూ. 5 వేలు బాలికకు చెల్లించాలని ఆదేశించింది. ఢిల్లీ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ కూడా బాలికకు రూ. 50 వేలు అందించాలని ఆదేశాలు జారీ చేసింది. మహిళకు వ్యక్తిగత గోప్యత హక్కు ఉంటుందని... దీన్ని పురుషులు కాలరాస్తున్నారని కోర్టు వ్యాఖ్యానించింది.