Pawan Kalyan: ‘జనసేన’ కార్యాలయం నుంచి రేపు ఉదయం బయలుదేరనున్న పవన్ కల్యాణ్!

  • హైదరాబాద్ లోని ‘జనసేన’ కార్యాలయం నుంచి రేపు ప్రారంభం
  • రేపు మధ్యాహ్నానికి కొండగట్టుకు.. ప్రత్యేక పూజలు  
  • అనంతరం యాత్రా ప్రణాళిక వెల్లడించనున్న జనసేనాని

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్  నిరంతర ప్రజా యాత్ర (చలోరే చలోరే చల్) రేపు ఉదయం తొమ్మిది గంటల తర్వాత ప్రారంభం కానుంది. హైదరాబాద్ లోని జనసేన పరిపాలన కార్యాలయం నుంచి కొండగట్టుకు బయలుదేరి వెళ్లనున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్ లో బయలుదేరి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆలయానికి రేపు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో చేరుకుంటారని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని ఆ ప్రకటనలో తెలిపింది.

 ప్రత్యేక పూజల అనంతరం పవన్ తన యాత్ర ప్రణాళికను వెల్లడిస్తారని, రేపు సాయంత్రం కరీంనగర్ చేరుకుంటారని, ‘జనసేన’ స్థానిక ప్రతినిధులతో భేటీ అవుతారని పేర్కొన్నారు. 23వ తేదీన... కరీంనగర్ లోని జగిత్యాల రోడ్డులో ఉన్న శుభం గార్డెన్స్ లో 10.45 నిమిషాలకు ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల జనసేన పార్టీ కార్యకర్తలతో సమావేశం కానున్నారు. మధ్యాహ్నం భోజనం అనంతరం, కొత్తగూడెం బయలుదేరి వెళ్లనున్నారు.

6.30 గంటల సమయంలో కొత్తగూడెం చేరుకుని, ఆ రాత్రికి అక్కడే బస చేస్తారు. 24వ తేదీన... ఉదయం 9.30 గంటలకు కొత్తగూడెం నుంచి ప్రదర్శనగా బయలుదేరి మధ్యాహ్నం 1.30 గంటలకు ఖమ్మం చేరుకుంటారు. మూడు గంటలకు ఖమ్మంలోని ఎం.బి. గార్డెన్స్ లో నిర్వహించే ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు. అనంతరం, పవన్ కల్యాణ్ తిరిగి హైదరాబాద్ బయలుదేరుతారని ‘జనసేన’ ప్రకటనలో పేర్కొంది. 

  • Loading...

More Telugu News