Chandrababu: ఇంతటి తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదు : సీఎం చంద్రబాబు

  • నేను రాజకీయాల్లోకి వచ్చి వచ్చే ఏడాదికి నలభై ఏళ్లు
  • ఈ మూడున్నరేళ్లలో నేను చేసిన పనులు ఎంతో తృప్తి నిచ్చాయి
  • టీడీపీ వర్క్ షాప్ లో అధినేత చంద్రబాబు

పనులు చేయడం ఎంత ముఖ్యమో, ఆ పనులను చేసే విధానమూ అంతే ముఖ్యమని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో ఒకరోజు టీడీపీ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే ఏదైనా ఓ కార్యక్రమంలో గానీ, ఓ పని వద్దకు గానీ వెళితే వారు ప్రవర్తించే తీరును ప్రజలు గమనిస్తుంటారని అన్నారు.

ప్రజలకు ఆయా నాయకులు ఏమేరకు అందుబాటులో ఉంటున్నారు, వారు సమాధానం చెప్పే తీరు..వీటన్నింటిని ప్రజలు గమనిస్తుంటారని, పనులు చేయడం ఎంత ముఖ్యమో, ప్రజలతో మమేకం కావడం, వారిని మెప్పించడం అంతే ముఖ్యమని, ఈ విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. ‘నేను రాజకీయాల్లోకి వచ్చి వచ్చే ఏడాదికి నలభై సంవత్సరాలు అవుతుంది. నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఈ మూడున్నర సంవత్సరాల్లో నేను చేసిన పనులు నాకు ఏంతో తృప్తిని మిగిల్చాయి. ఇంతటి తృప్తి నా జీవితంలో ఎప్పుడూ లేదు’ అని అన్నారు.

  • Loading...

More Telugu News