TRS: టీఆర్ఎస్ కు భజన చేస్తున్న గవర్నర్ నరసింహన్!: వీహెచ్ తీవ్ర వ్యాఖ్యలు
- ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉంది
- ఇకపై అవినీతి కేసులో గవర్నర్ నూ విచారించాల్సి వస్తుంది
- నరసింహన్ ని విడిచిపెట్టమంటూ మండిపడ్డ వీహెచ్
టీఆర్ఎస్ కు గవర్నర్ నరసింహన్ భజన చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంతరావు (వీహెచ్) తీవ్ర విమర్శలు చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వ అవినీతిలో గవర్నర్ కు భాగస్వామ్యం ఉందని, ఇకపై అవినీతి కేసులో గవర్నర్ నూ విచారించాల్సి వస్తుందని, నరసింహన్ ని తాము విడిచిపెట్టమని ఈ సందర్భంగా వీహెచ్ వ్యాఖ్యానించడం గమనార్హం. నాడు తెలంగాణలో రైతులకు సంకెళ్లు వేస్తే మాట్లాడని గవర్నర్, ఇప్పుడు టీఆర్ఎస్ భజన చేస్తున్నారంటూ మండిపడ్డారు.