statue of liberty: స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మూతపడింది!

  • ద్రవ్య వినిమయ బిల్లుకు లభించని ఆమోదం
  • అమెరికా ప్రభుత్వం షట్ డౌన్
  • మూత పడ్డ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ

అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మూతపడింది. న్యూయార్క్ లో ఉన్న ఈ ప్రముఖ పర్యాటక స్థలం మూగబోయింది. వీకెండ్ కావడంతో అక్కడకు వెళ్లడానికి వచ్చిన వేలాది మంది పర్యాటకులు నిరుత్సాహానికి గురవుతున్నారు. అమెరికా ప్రభుత్వం షట్ డౌన్ కావడమే ఇది మూతపడటానికి కారణం.

 అధికార రిపబ్లికన్లు, ప్రతిపక్ష డెమొక్రాట్ల మధ్య అవగాహన కుదరకపోవడంతో... ద్రవ్య వినిమయ బిల్లు సెనేట్ లో ఆమోదం పొందని విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎన్నో నెలల ముందుగానే టికెట్లను బుక్ చేసుకున్న విదేశీ టూరిస్టులు అసంతృప్తికి గురవుతున్నారు. బుద్ధి ఉంటే మరొకసారి అమెరికాలో అడుగుపెట్టబోమంటూ కొందరు విదేశీ టూరిస్టులు తిట్టుకుంటున్న సన్నివేశాలు కూడా అక్కడ కనిపించాయి.

statue of liberty
america shut down
  • Loading...

More Telugu News