Pawan Kalyan: ఇక వస్తున్నా... కీలక ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!

  • నా అప్రహిత రాజకీయ యాత్ర ఇక మొదలు
  • కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను
  • మా కుటుంబ ఇల వేల్పు ఆంజనేయ స్వామి
  • నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను

'మీ ముందుకు వస్తున్నా ఆశీర్వదించండి' అంటూ సినీనటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కీలక ప్రకటన చేశారు. 'నా అప్రహిత రాజకీయ యాత్రను తెలుగునేలపై పుణ్యస్థలమైన కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ప్రారంభించనున్నాను. 2009 ఎన్నికలకు ప్రచారం చేస్తోన్న తరుణంలో సంభవించిన పెను ప్రమాదం నుంచి నేను ఇక్కడే క్షేమంగా బయటపడ్డాను. దానికి తోడు మా కుటుంబ ఇల వేల్పు ఆంజనేయ స్వామి కావడం కూడా ఇక్కడ నుంచి నా నిరంతర రాజకీయ యాత్రను ఆరంభించడానికి కారణభూతమైంది.

 సర్వమత ప్రార్థనల అనంతరం రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల ఆశీస్సుల కోసం, సమస్యలను అధ్యయనం చేసి అవగాహన చేసుకోవడానికి ఈ యాత్ర ద్వారా మీ ముందుకు వస్తున్నాను. నా పర్యటన ప్రణాళికను కొండగట్టులో ప్రకటిస్తాను' అని పవన్ కల్యాణ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. అంతేకాదు, కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయం అంటూ ఆ దేవాలయ ఫొటోను కూడా పవన్ కల్యాణ్ పోస్ట్ చేయడం విశేషం.  

  • Error fetching data: Network response was not ok

More Telugu News