anushka: 'భాగమతి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్!

  • 'భాగమతి'గా అనుష్క 
  • రేపే ప్రీ రిలీజ్ ఈవెంట్ 
  • జనవరి 26వ తేదీన విడుదల  

అనుష్క ప్రధాన పాత్రను పోషించిన 'భాగమతి' .. ఈ నెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అశోక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నుంచి వచ్చిన పోస్టర్స్ కి .. టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు, ఈ సినిమాపై అంచనాలు అమాంతంగా పెరిగిపోయాయి.

అనుష్క రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపిస్తుండటం ఈ సినిమాలో అన్నిటికంటే ఎక్కువగా ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశంగా మారిపోయింది. అలాంటి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వస్తున్నట్టుగా సమాచారం. ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ ప్రభాస్ కి హోమ్ బ్యానర్ వంటిది. ఇక అనుష్కతో ప్రభాస్ కి మంచి స్నేహం వుంది. అందువలన ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వస్తున్నాడని చెబుతున్నారు.  

  • Loading...

More Telugu News