Chandrababu: ‘మీ-సేవ’, ‘ఫైబర్ గ్రిడ్’ సీఈవోలపై చంద్రబాబు సీరియస్
- వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై చంద్రబాబుకు మంత్రుల ఫిర్యాదు
- పింఛన్ల విషయంలో తేడా జరిగితే సంహించేది లేదు
- టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అవకతవకలు ఎలా జరుగుతాయి?: చంద్రబాబు
‘మీ-సేవ’, ‘ఫైబర్ గ్రిడ్ సీఈవోలపై ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. వృద్ధాప్య పింఛన్ల అవకతవకలపై మంత్రులు అయ్యన్నపాత్రుడు, కళా వెంకట్రావులు ఫిర్యాదు చేశారు. తప్పుడు పత్రాలతో దరఖాస్తు చేసుకున్న విషయాన్ని ఆయన దృష్టికి వారు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు స్పందిస్తూ, పింఛన్ల విషయంలో తేడా జరిగితే సంహించేది లేదని, టెక్నాలజీ అందుబాటులో ఉన్నా అవకతవకలు ఎలా జరుగుతాయంటూ అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అవకతవకలకు పాల్పడితే జైలు కెళ్తారని చంద్రబాబు హెచ్చరించారు.