mim: నేడు కర్నూలుకు వెళ్తున్న అసదుద్దీన్ ఒవైసీ

  • నేడు కర్నూలులో బహిరంగసభ
  • ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా సభ
  • హాజరవుతున్న ఒవైసీ

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ నేడు కర్నూలుకు వెళుతున్నారు. ట్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా నగరంలో జరిగే బహిరంగసభకు ఆయన హాజరవుతున్నారు. నగరంలోని ఉస్మానియా కళాశాల మైదానంలో ఈ సభ జరగనుంది. ముస్లిం మహిళల పాలిట శాపంగా పరిణమించిన ట్రిపుల్ తలాక్ ను నిషేధించే దిశగా కేంద్ర ప్రభుత్వం పావులు కదిపిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన బిల్లు ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో ఆమోదం పొందింది.

అయితే, రాజ్యసభలో బీజేపీకి తగినంత మెజార్టీ లేకపోవడం, మిత్ర పక్షాలు కూడా ఈ విషయంలో బీజేపీకి మద్దతు పలకకపోవడంతో... విపక్షాల డిమాండ్ తో విధిలేని పరిస్థితుల్లో బిల్లును స్టాండింగ్ కమిటికీ పంపింది కేంద్రం. మరోవైపు, దీనిపై ఆర్డినెన్స్ తీసుకొచ్చే దిశగా కూడా కేంద్రం ఆలోచిస్తోందని తెలుస్తోంది. 

mim
triple talak
Asaduddin Owaisi
  • Loading...

More Telugu News