Hyderabad: నటన పై ఆసక్తి గల వారికి శుభవార్త.. హైదరాబాద్ లో ఉచిత శిక్షణ
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, థియేటర్ అండ్ మీడియా రిపర్టరీ ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు
- లలిత కళాతోరణంలో 30 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం
- జనవరి 20, 21 తేదీలలో అభ్యర్థుల ఎంపిక
నటనపై ఆసక్తి గల వారికి శుభవార్త. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ.. తెలంగాణ థియేటర్ అండ్ మీడియా రిపర్టరీతో కలసి నటనలో ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించనుండి. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. నాంపల్లిలోని లలిత కళాతోరణంలో 30 రోజుల పాటు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
జనవరి 20, 21 తేదీలలో ఉదయం 10 గంటల నుండి సాయత్రం 5 గంటల వరకు రవీంద్రభారతిలోని ఘంటసాల ప్రాంగణలో అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఈ విషయాన్ని భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. ఔత్సాహికులకు ఈ శిక్షణా కార్యక్రమం ఉపయోగపడుతుందని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని శిక్షణా ఉపాధ్యాయుడు రమేష్ పేర్కొన్నారు.