KCR: తెలంగాణతో ఏపీ ఏమాత్రం పోటీపడలేదు: సీఎం కేసీఆర్
- ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018’లో పాల్గొన్న కేసీఆర్
- ఆంధ్రాతో కలపకముందు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమే
- ఉమ్మడి పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించారు
- హైదరాబాద్ పునర్ నిర్మాణానికి రూ.25 వేల కోట్లు అవసరం
తెలంగాణ రాష్ట్రంతో ఏపీ పోటీపడలేదని సీఎం కేసీఆర్ అన్నారు. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో ‘ఇండియా టుడే’ సౌత్ కాన్ క్లేవ్ - 2018’ జరిగింది. ఈ సందర్భంగా ప్రముఖ జర్నలిస్టు రాజ్ దీప్ సర్దేశాయ్ అడిగిన పలు ప్రశ్నలకు కేసీఆర్ సమాధానమిచ్చారు. ఆంధ్రాతో కలపకముందు కూడా తెలంగాణ ధనిక రాష్ట్రమేనని అన్నారు.
ఉమ్మడి పాలకులు హైదరాబాద్ అభివృద్ధిని విస్మరించారని, నీటి వనరులన్నీ కబ్జా చేసి అందమైన హైదరాబాద్ నగరాన్ని ధ్వంసం చేశారని అన్నారు. హైదరాబాద్ కు గార్డెన్ సిటీగా పూర్వ వైభవం తీసుకురావడమే తమ లక్ష్యం అని అన్నారు. హైదరాబాద్ నగరాన్ని పునర్ నిర్మించడానికి రూ.25 వేల కోట్లు ఖర్చు అవసరమని అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే ఎక్కువగా ఉన్నారని, 50 శాతం రిజర్వేషన్లు తెలంగాణానికి సరిపోవని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని అభిప్రాయపడ్డారు.