NTR: నటసార్వభౌమ ఎన్టీఆర్ బయోపిక్ ఫస్ట్ లుక్ వచ్చేసింది... చూశారా?

  • బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో చిత్రం
  • ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఫస్ట్ లుక్
  • భారీ కాన్వాయ్ మధ్య చైతన్యరథంపై ఎన్టీఆర్

బాలకృష్ణ హీరోగా, తేజ దర్శకత్వంలో రూపొందుతున్న మహానేత ఎన్టీఆర్ బయోపిక్ 'ఎన్ టీ ఆర్' ఫస్ట్ లుక్ ను చిత్ర బృందం నేడు విడుదల చేసింది. ఎంఎం కీరవాణి సంగీత దర్శకత్వంలో సాయి కొర్రపాటి, ఇందూరి విష్ణువర్థన్, బాలకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం కానుంది.

బ్లాక్ అండ్ వైట్ లో ఉన్న ఫస్ట్ లుక్ లో "ప్రజలే దేవుళ్లు, సమాజమే దేవాలయంగా జీవించిన ఓ మహానుభావునికి ఇదే మా నివాళి..." అని రాసుండగా, భారీ కాన్వాయ్ వెంట రాగా, చైతన్య రథంపై ఓ చేత్తో మైక్ పట్టుకుని నిలుచున్న ఎన్టీఆర్ ను చూపించారు. ఆయన్ను చూసిన ప్రజలు ఆనందంతో చేతులు ఊపుతూ అభివాదం చేస్తున్నట్టు పోస్టర్ లో కనిపిస్తోంది.

నేడు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ చిత్రంలో ఇతర నటీనటులు ఎవరన్న విషయం త్వరలో వెల్లడి కానుండగా, ఆయన భార్య బసవతారకం పాత్రకు ఫేస్ రికగ్నిషన్ సాంకేతికతను వాడుకోవాలని దర్శకుడు తేజ భావిస్తున్నట్టు సమాచారం.

NTR
Bio Pic
Balakrishna
First Look
Teja
  • Loading...

More Telugu News