Chandrababu: ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే టీఆర్ఎస్ లో టీడీపీ విలీనం కావాల్సిందే: మోత్కుపల్లి సంచలన వ్యాఖ్య

  • ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన మోత్కుపల్లి
  • పార్టీ పూర్తిగా పతనమయ్యే వరకూ ఆగవద్దు
  • టీఆర్ఎస్ లో ఉన్నదంతా టీడీపీ వారే
  • గౌరవంగా విలీనం చేయాలని చంద్రబాబుకు సలహా

దివంగత ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని మాజీ మంత్రి, టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, రాష్ట్రంలో తన వంటి నేతలు ఎంతో మానసిక క్షోభకు గురవుతున్నారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా పతనమైందన్న చెడ్డ పేరు రాకముందే నాయకులు స్పందించాలని ఆయన కోరారు. టీఆర్ఎస్ లో ఉన్న నాయకులంతా టీడీపీవారేనని గుర్తు చేసిన ఆయన, తెలంగాణ టీడీపీ విభాగాన్ని ఆ పార్టీలో విలీనం చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. గౌరవప్రదంగా ఉండాలంటే విలీనం ఒక్కటే మార్గమని, చంద్రబాబుకు తాను ఇచ్చే వ్యక్తిగత సలహా ఇదేనని, తనను అర్థం చేసుకోవాలని మోత్కుపల్లి విజ్ఞప్తి చేశారు.

Chandrababu
Motkupalli
TTelugudesam
TRS
  • Loading...

More Telugu News