Kathi Mahesh: పూనమ్ కౌర్ మాట్లాడింది నిజంగా కత్తి మహేష్ గురించి కాదనుకుంటా: రాంగోపాల్ వర్మ

  • పోర్న్ స్టార్ మియాపై కత్తి మహేష్ పొగడ్తలు
  • సోషల్ మీడియాలో మండిపడ్డ పూనమ్ కౌర్
  • 'కత్తి' గురించి కాదులే అన్న వర్మ

ఇండియాలో శృంగార తారలకే అధిక గౌరవం లభిస్తోందని, సాధారణ మహిళలను అసభ్యకరంగా చూస్తున్నారని నటి పూనమ్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతుండగా, అవి సినీ విశ్లేషకుడు కత్తి మహేష్ ను ఉద్దేశించినవేనని చర్చ సాగుతుండగా, దర్శకుడు రాంగోపాల్ వర్మ స్పందించాడు.

 "ఐ గాడ్‌ ప్రామిసింగ్‌లీ ఫీలింగ్‌ దట్‌.. ఇట్‌ ఇజ్‌ నో వే స్లిప్పర్‌ షాట్‌ కత్తి మహేష్" (దేవుడి మీద ప్రమాణం చేస్తూ నేను అనుకుంటున్నది ఏంటంటే, అదేమీ కత్తి మహేష్ ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య కాదు) అని ట్వీట్ చేశారు. కాగా, వర్మ 'గాడ్, సెక్స్ అండ్ ట్రూత్' పేరిట పోర్న్ స్టార్ మియాతో ఓ చిత్రం తీసి దాని ట్రయిలర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. మియా ఓ అద్భుతమని, మోహన రూపమని కత్తి మహేష్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Kathi Mahesh
Ramgopal Varma
Poonam Kaur
Twitter
  • Loading...

More Telugu News