airplane: అదనపు లగేజీకి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని.. 10 చొక్కాలు వేసుకుని విమానంలోకి వచ్చిన వైనం!

  • ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో ఘటన
  • విమానంలోంచి దిగబోనని వాదన
  • అరెస్టు చేసిన పోలీసులు

ఓ ప్రయాణికుడు ఎనిమిది జతల ట్రౌజర్లు, పది చొక్కాలు వేసుకుని విమానం ఎక్కిన ఘటన బ్రిటిష్‌ ఎయిర్‌వేస్‌ విమానంలో చోటు చేసుకుంది. అంతేకాదు, ఆయనను చూసి తోటి ప్రయాణికులు, విమాన సిబ్బంది అభ్యంతరాలు వ్యక్తం చేయగా వారంతా తనతో దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ సెల్ఫీ వీడియో తీశాడు. తాను అలాగే ప్రయాణిస్తానని, విమానం దిగబోనని వాదించాడు.

దీంతో విమాన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వగా.. అక్కడికి చేరుకున్న పోలీసులు అతని కళ్లల్లో పెప్పర్‌ స్ప్రే కొట్టి అరెస్టు చేశారు. అతడి పేరు రేయాన్‌ అని, ఆ ప్రయాణికుడు విమానంలో అదనపు లగేజీకి డబ్బులు చెల్లించాల్సి వస్తుందని, ఇలా ఒకదానిపై ఒకటిగా అన్ని దుస్తులనూ ధరించి వచ్చాడని అధికారులు గుర్తించారు. ఈ ఘటన ఐస్‌లాండ్‌లోని కెఫ్లావిక్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టులో చోటుచేసుకుంది.

airplane
island
passenger
arrested
  • Loading...

More Telugu News