amala paul: అమలాపాల్‌కు కోర్టులో ఊరట.. బెయిల్ మంజూరు!

  • ఖరీదైన కారు కొని టాక్స్‌ ఎగ్గొట్టిన హీరోయిన్‌ అమలాపాల్ 
  • ఆమెపై పలు సెక్షన్ల కింద కేసులు
  • పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన హీరోయిన్‌
  • రూ.లక్ష పూచీకత్తుతో ముందస్తు బెయిల్‌

గతంలో ఖరీదైన కారు కొన్న హీరోయిన్‌ అమలాపాల్ తప్పుడు చిరునామా పత్రాలు సమర్పించి రూ.20 లక్షల పన్ను ఎగ్గొట్టినట్లు కేసు ఎదుర్కుంటోన్న విషయం తెలిసిందే. ఇటీవ‌ల ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా మొద‌ట పోలీస్ స్టేష‌న్‌లో లొంగిపోవాలని ఆమెను కోర్టు ఆదేశించింది. దీంతో ఆమె ఎట్టకేలకు పోలీస్ స్టేషన్‌కు వచ్చి లొంగిపోవడంతో కేరళ హైకోర్టు ఈ రోజు రూ.లక్ష పూచీకత్తుతో ఆమెకు బెయిల్‌ మంజూరు చేసింది. పోలీసుల విచారణకు సహకరించాలని ఆదేశించింది. ఆమెపై కేరళలో పలు సెక్షన్ల కింద కేసులు ఉన్నాయి.    

amala paul
car
tax
bail
High Court
  • Loading...

More Telugu News