Jignesh: మంద కృష్ణ కోసం చంచల్ గూడ జైలుకు వచ్చిన గుజరాత్ యువనేత జిగ్నేష్!

  • ప్రస్తుతం చంచల్ గూడ జైలులో మంద కృష్ణ
  • ఇటీవల ట్యాంక్ బండ్ వద్ద అనుమతి లేకుండా ధర్నా
  • జిగ్నేష్ రాకతో జైలు వద్ద దళిత సంఘాల సందడి

ఇటీవల ట్యాంక్ బండ్ వద్ద అనుమతి లేకుండా నిరసనకు దిగడంతో పాటు, శాంతిభద్రతల విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారన్న కారణంతో మంద కృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు, కోర్టు ఆదేశాల మేరకు చంచల్ గూడ జైలుకు తరలించగా, ఆయన్ను గుజరాత్ యువనేత, ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ ఈ ఉదయం పరామర్శించారు. జైలుకు వచ్చిన జిగ్నేష్, లోపలికి వెళ్లి సుమారు అరగంట పాటు మంద కృష్ణతో మాట్లాడి బయటకు వచ్చారు. ఇటీవల జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జిగ్నేష్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ పడి విజయం సాధించిన సంగతి తెలిసిందే. జిగ్నేష్ వచ్చారన్న విషయాన్ని తెలుసుకున్న దళిత సంఘాలు పెద్దఎత్తున జైలు వద్దకు రావడంతో సందడి వాతావరణం నెలకొంది.

Jignesh
Gujarat
Chanchalguda
Manda Krishna
  • Loading...

More Telugu News