Super Blue Blood Moon: 150 ఏళ్ల తరువాత... ఆకాశంలో కనిపించనున్న సూపర్ బ్లూ బ్లడ్ మూన్!

  • జనవరి 31న ఆకాశంలో అద్భుతం
  • 1866లో సూపర్ బ్లూ బ్లడ్ మూన్
  • ఆ తరువాత ఇప్పుడే
  • అద్భుతంగా కనిపించే చంద్రగ్రహణం

గత సంవత్సరం ప్రపంచం ఓ సంపూర్ణ సూర్య గ్రహణాన్ని సంభ్రమాశ్చర్యాలతో చూడగా, ఈ సంవత్సరం నింగిలో మరో అద్భుతం గోచరించనుంది. జనవరి 31న పౌర్ణమి నాడు ఏర్పడే చంద్రగ్రహణం సందర్భంగా చంద్రుడు 'సూపర్ బ్లూ బ్లడ్ మూన్'గా కనిపిస్తాడని, ఇది అత్యంత అరుదని శాస్త్రవేత్తలు వెల్లడించారు. కొత్త సంవత్సరంలో ఇదే తొలి గ్రహణమని, యూఎస్ తో పాటు ఉత్తర యూరప్, రష్యా, ఆసియా, ఆస్ట్రేలియా, హిందూ, పసిఫిక్ మహాసముద్రాల రీజియన్ లో ఈ గ్రహణం కనిపిస్తుందని వెల్లడించారు.

ఈ తరహా గ్రహణం 150 సంవత్సరాలకు ఒకసారి వస్తుందని, కాబట్టి దీన్ని జీవనకాల అవకాశంగా తీసుకుని అద్భుతమైన గ్రహణాన్ని వీక్షించాలని సైంటిస్టులు సూచించారు. భారత ఉపఖండం, మధ్య ప్రాచ్య దేశాలు, తూర్పు దేశాల్లో కొంత పాక్షికంగా గ్రహణం కనిపిస్తుందని, తూర్పు ఆసియా దేశాలు, ఇండొనేషియా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో స్పష్టమైన గ్రహణాన్ని చూడవచ్చని, అలస్కా, హయావ్, కెనడా ప్రాంతాల్లో గ్రహణం ఆరంభం నుంచి చివరి వరకూ కనిపిస్తుందని అన్నారు. భూమి దక్షిణ భాగపు నీడ చంద్రుని ఆక్రమించే క్రమంలో ఏర్పడే ఈ గ్రహణం అద్భుత దృశ్యమని తెలిపారు. ఈ తరహా గ్రహణం 1866, మార్చి 31న సంభవించిందని, ఆ తరువాత ఇప్పుడే రానుందని అన్నారు.

Super Blue Blood Moon
January 31
Eclips
  • Loading...

More Telugu News