mp haribabu: నరసింహన్ వద్దు.. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించండి: రాజ్ నాథ్ కు బీజేపీ ఎంపీ లేఖ

  • నరసింహన్ పై ఏపీలో పెరుగుతున్న వ్యతిరేకత
  • గవర్నర్ ను మార్చాలంటున్న బీజేపీ నేతలు
  • రాజ్ నాథ్ కు హరిబాబు లేఖ

ఇరు తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ పై ఏపీ నేతల్లో వ్యతరేకత పెరిగిపోతోంది. ముఖ్యంగా బీజేపీ నేతలు నరసింహన్ పై బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. ఏపీపై నరసింహన్ సవతి తల్లి ప్రేమను ప్రదర్శిస్తున్నారంటూ ఇప్పటికే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

తాజాగా బీజేపీ ఎంపీ హరిబాబు కూడా గవర్నర్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. ఏపీకి కొత్త గవర్నర్ ను నియమించాలని కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు లేఖ రాశారు. హైకోర్టు ఏర్పాటుకు వెంటనే చొరవ తీసుకోవాలని లేఖలో కోరారు. హరిబాబు లేఖ పట్ల కేంద్ర ప్రభుత్వ స్పందన ఎలా ఉంటుందో వేచి చూడాలి. 

mp haribabu
bjp
rajnath singh
governor narasimhan
  • Loading...

More Telugu News