Australia Open: ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పెను సంచలనం... వీనస్ విలియమ్స్ అవుట్!

  • స్విస్ న్యూ స్టార్ బెలిందా చేతిలో ఓటమి
  • తొలి రౌండ్ లోనే వెనక్కు మళ్లిన వీనస్
  • 1997 తరువాత విలియమ్స్ సిస్టర్స్ లేకుండా రెండో రౌండ్ పోటీలు

2018 తొలి గ్రాండ్ స్లామ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ లో పెను సంచలనం నమోదైంది. ఏడు సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, గత సంవత్సరం ఫైనలిస్టు వీనస్ విలియమ్స్ ను స్విస్ న్యూస్టార్ బెలిందా బెన్సిక్ సునాయాసంగా ఓడించింది. గతంలో ఎన్నడూ తనకు ఎదురు పడని బెలిందా చేతిలో వీనస్ 6-3, 7-5 తేడాతో ఘోరంగా ఓడిపోయింది. 1997 తరువాత విలియమ్స్ సిస్టర్స్ లేకుండా ఆస్ట్రేలియన్ ఓపెన్ రెండో రౌండ్ పోటీలు జరుగుతూ ఉండటం ఇదే తొలిసారి.

 ఇటీవల ఓ బిడ్డకు జన్మనిచ్చిన సెరీనా ఈ పోటీల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. మ్యాచ్ అనంతరం వీనస్ మాట్లాడుతూ, తాను బాగా ఆడటం లేదని అనుకోవడం లేదని, బెలిందా తనకన్నా బాగా ఆడిందని వ్యాఖ్యానించింది. కాగా, గత సంవత్సరం హోప్ మన్ కప్ లో రోజర్ ఫెదరర్ తో కలసి ట్రోఫీని అందుకోవడంతో బెలిందా పేరు ప్రపంచానికి తెలిసింది.

Australia Open
Venus Williams
Belinda Benics
  • Loading...

More Telugu News