bengaluru: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఇన్స్ పెక్టర్ భార్యనే దోచేశారు!

  • 70 గ్రాముల బంగారు గొలుసును తెంచుకెళ్లారు
  • ఇన్స్ పెక్టర్ వెంటపడ్డా దొంగలు దొరకలేదు
  • గాలిస్తున్న పోలీసులు

పట్టపగలే సాక్షాత్తు పోలీస్ ఇన్స్ పెక్టర్ భార్య మెడలోని బంగారు గొలుసును దోచుకెళ్లిన ఘటన బెంగళూరు నగరంలో కలకలం రేపుతోంది. నగరంలోని పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో కెంచె గౌడ ఇన్స్ పెక్టర్ గా పని చేస్తున్నారు. హెచ్ఎంటీ లేఔట్ లో ఆయన నివాసం ఉంటున్నారు. ఆయన భార్య ఉదయం ఇంట్లోని చెత్తను బయట పారబోసి లోపలకు వస్తుండగా... బైక్ పై వచ్చిన ఇద్దరు స్నాచర్లు ఆమె మెడలోని 70 గ్రాముల బంగారు గొలుసును తెంచుకెళ్లారు.

ఆ సమయంలో కెంచె గౌడ ఇంట్లోనే ఉన్నారు. భార్య అరుపులు విని బయటకు వచ్చిన ఆయన... దొంగలను వెంటాడినా వారు దొరకలేదు. ఈ చోరీ అంతా వారి ఇంట్లోని సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం అయింది. ప్రస్తుతం దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇరానీ గ్యాంగే ఈ పనికి పాల్పడిందని భావిస్తున్నారు.

bengaluru
bengaluru chain snatching
  • Loading...

More Telugu News