book fair: జనవరి 18 నుంచి జాతీయ పుస్తక ప్రదర్శన
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-199b2ec136a4b9b9a56f450616093f4f831dd1e8.jpg)
- ఎన్టీఆర్ స్టేడియంలో ప్రదర్శన
- 28వ తేదీ వరకు
- తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహణ
ప్రతి ఏడాది హైదరాబాద్ నగరంలో జరిగే జాతీయ పుస్తక ప్రదర్శనకు ఈ ఏడాది కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరి 18 న ఈ ప్రదర్శన ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో ఈ పుస్తక ప్రదర్శన జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 300 మంది ప్రచురణకర్తలు ఈ పుస్తక ప్రదర్శనలో పాల్గొనబోతున్నారు.
జనవరి 28 వరకు పది రోజుల పాటు జరగనున్న ఈ జాతీయ పుస్తక ప్రదర్శనను తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నిర్వహిస్తోంది. సందర్శకుల సౌకర్యార్థం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ కార్యదర్శి చంద్రమోహన్ కోయి తెలిపారు.