Rajamouli: గ్రహాల అనుకూలత కోసం మంత్రాలయంలో పూజలు చేయిస్తున్న రాజమౌళి?

  • గ్రహాల ప్రసన్నం కోసం రాజమౌళి పూజలు
  • ముగిసిన శుక్ర మహాదశ.. ఇప్పుడు మరో దశలోకి
  • టాలీవుడ్‌లో హాట్ టాపిక్

దర్శకుడు రాజమౌళి గురించి ఓ ఆసక్తికర వార్త ఇప్పుడు టాలీవుడ్‌లో షికారు చేస్తోంది. నిన్నమొన్నటి వరకు ఉన్న గ్రహ దశ ప్రస్తుతం ఆయనకు లేదట. అందుకనే గ్రహాలను ప్రసన్నం చేసుకునేందుకు పూజలు చేయిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వేద పండితులు చెప్పిన మాటను తూ.చ. తప్పకుండా పాటిస్తున్న రాజమౌళి మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నట్టు సమాచారం.

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’, ‘బాహుబలి-2’ సినిమాల సమయంలో ఆయనకు శుక్రమహాదశ నడిచిందట. ఈ దశలో ఎవరున్నా పట్టిందల్లా బంగారం అవుతుందని చెబుతారు. అయితే ఇప్పుడా దశ పూర్తయి మరో దశలోకి రాజమౌళి అడుగుపెడుతున్నాడు. దీంతో గ్రహాల అనుకూలత కోసం పూజలు చేయిస్తే బాగుంటుందని పండితులు చెప్పారట. దీనికి సరేనన్న దర్శక ధీరుడు మంత్రాలయంలో పూజలు చేయిస్తున్నాడని టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది.  

Rajamouli
Tollywood
Director
Mantralayam
  • Loading...

More Telugu News