up shia wakf board chairmen: యూపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ కు దావూద్ గ్యాంగ్ వార్నింగ్!

  • వసీం రిజ్వీకి హెచ్చరిక
  • మొత్తం కుటుంబాన్ని హతమారుస్తామంటూ వార్నింగ్
  • పోలీసులకు ఫిర్యాదు

ఉత్తరప్రదేశ్ షియా వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ వసీం రిజ్వీతో పాటు అతని కుటుంబాన్ని హతమారుస్తామంటూ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ వార్నింగ్ ఇచ్చింది. దావూద్ ఇబ్రహీం అనుచరుడు ఫోన్ ద్వారా ఈ హెచ్చరిక జారీ చేశాడు. ముస్లిం విద్యార్థులను తీవ్రవాదులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్న మదర్సాలను మూసివేయాలంటూ ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్ లకు యూపీ షియా సెంట్రల్ వక్ఫ్ బోర్డు ఛైర్మన్ వసీం రిజ్వీ లేఖ రాశారు.

ఈ నేపథ్యంలోనే దావూద్ అనుచరుడు ఈ హెచ్చరికలు జారీ చేశాడు. అయోధ్యలోని రామాలయానికి వసీం రిజ్వీ అనుకూలంగా గతంలో వ్యాఖ్యలు చేశారు. మదర్సాలు టెర్రరిస్టుల తయారీ కేంద్రాలని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, తనతో పాటు తన కుటుంబాన్ని హతమారుస్తానంటూ ఫోన్ ద్వారా హెచ్చరికలు వచ్చాయని లక్నో పోలీసులకు వసీం రిజ్వీ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

up shia wakf board chairmen
wasin rizvi
dawood ibrahim
warning to wasim rizvi
  • Loading...

More Telugu News