Congress: రాహుల్ చేతిలో 'బాహుబలి' బాణం, రావణుడిగా మోదీ... అమేథిలో వెలసిన పోస్టర్ చూడండి!

  • అప్పుడే పార్లమెంట్ ఎన్నికల కోలాహలం మొదలు
  • కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేటి నుంచి అమేథిలో రాహుల్ తొలి పర్యటన
  • బీజేపీపై 'పోస్టర్ వార్'ను ప్రారంభించిన కాంగ్రెస్

వచ్చే సంవత్సరం జరిగే పార్లమెంట్ ఎన్నికలకు రాహుల్ గాంధీ సొంత నియోజకవర్గం అప్పుడే సిద్ధమైపోయింది. కాంగ్రెస్ పార్టీ స్థానిక నేతలు మోదీపై 'పోస్టర్ వార్'ను ప్రారంభించారు. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ తొలిసారిగా అమేథీకి రానున్న నేపథ్యంలో, ఆయన్ను రాముడిగా చూపిస్తూ, చేతిలో బాహుబలి బాణం ఉంచి, ఎదురుగా పది తలల రావణుడి వేషంలో మోదీని ఉంచిన పోస్టర్లను ప్రచురించారు.

"రాహుల్ రూపంలో రామావతారం. 2019లో రాహుల్ రాజ్యం వస్తుంది" అన్న క్యాప్షన్ ఉంచారు. మరో పోస్టరులో రాహుల్ ను కృష్ణుడిగా చూపుతూ, 'యుద్ధ వీరుడు తన ప్రయాణాన్ని ప్రారంభించారు' అన్న క్యాప్షన్ తోనూ పోస్టర్లు వేశారు. కాగా, నేటి మధ్యాహ్నం రాయ్ బరేలీకి రానున్న ఆయన సలోన్ నగర్ పంచాయత్ లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఆపై రేపు ముసాఫిర్ ఖాన్, జియాస్, జగదీశ్ పూర్, మోహన్ గంజ్ ప్రాంతాల్లో పర్యటించనున్నారు.

Congress
Rahul Gandhi
Narendra Modi
Amethi
  • Error fetching data: Network response was not ok

More Telugu News