tadipatri: తాడిపత్రిలో వినూత్నంగా పందుల పందేలు!
- ఈ పోటీల్లో పాల్గొనేందుకు తమ వరాహాలతో తరలిచ్చిన యజమానులు
- పోటీలో సుమారు 40 వరాహాలు
- తలపడి నెగ్గిన వరాహమే విజేత
సంక్రాంతి పండగ సందర్భంగా గోదావరి జిల్లాల్లో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. అదే, అనంతపురం జిల్లా తాడిపత్రిలో మాత్రం వినూత్నంగా పందుల పందేలు జరుగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ పోటీల్లో పాల్గొనేందుకు వరాహాలను తీసుకుని వాటి యజమానులు ఇక్కడికి తరలివచ్చారు. మహబూబ్ నగర్, గద్వాల్, హిందూపురం, కల్యాణదుర్గం, కడప, బేతెంచర్ల తదితర ప్రాంతాల నుంచి సుమారు 40 మంది తమ వరాహాలను తీసుకుని ఇక్కడికి వచ్చారు.
ఇక ఈ పోటీలో.. రెండేసి వరాహాలు సుమారు అరగంటకు పైగా ముఖాముఖీ భీకరంగా తలపడతాయి. ఈ విధంగా నిర్వహించే పోటీలో ఫైనల్ గా విజయం సాధించిన వరాహాన్ని విజేతగా ప్రకటించి, దాని యజమానికి నగదు బహుమతిని అందజేస్తారు. వినూత్నంగా నిర్వహిస్తున్న ఈ పోటీలను చూసేందుకు తాడిపత్రి వాసులతో పాటు, సమీప, దూర ప్రాంతాల వారు అధిక సంఖ్యలో అక్కడికి హాజరయ్యారు.