Bhogi: పొద్దున్నే భోగి మంటలు... ఆపై నేరుగా వెంకన్న దర్శనానికి చంద్రబాబు, బాలయ్య ఫ్యామిలీలు!

  • ఉదయం సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన సీఎం
  • ఆపై కుటుంబ సభ్యులతో కలసి తిరుమలకు
  • దర్శన ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు

ఈ ఉదయం చిత్తూరు జిల్లా నారావారి పల్లెలో భోగి మంటలు వేసి సంక్రాంతి ఉత్సవాలను ప్రారంభించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలసి తిరుమల చేరుకుని శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. చంద్రబాబుతో పాటు ఆయన సతీమణి భువనేశ్వరి, హీరో బాలకృష్ణ దంపతులు, మంత్రి లోకేష్ దంపతులు తదితరులు తిరుమలకు వచ్చారు. కాగా, నిన్న సాయంత్రం నారావారి పల్లెకు వచ్చిన సీఎం రాత్రి అక్కడే బస చేశారు. తిరుమలకు వచ్చిన సీఎం బంధుమిత్రులకు స్వాగతం పలికిన టీటీడీ అధికారులు, వారికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తరువాత తీర్థ ప్రసాదాలు అందించి, ఆశీర్వచనాలు పలికారు.

Bhogi
Chandrababu
Balakrishna
Tirumala
TTD
  • Loading...

More Telugu News