Uttar Pradesh: ఫొటో పిచ్చితో పరువు పోగొట్టుకున్న బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యే... వీడియో చూడండి!

  • ప్రచార పిచ్చితో ఒకరిపై ఒకరు దాడి
  • ఉత్తర ప్రదేశ్ లో పేదలకు దుప్పట్లు పంచే వేళ గొడవ
  • వైరల్ అవుతున్న వీడియో!

ఓ బీజేపీ ఎంపీ, మరో బీజేపీ ఎమ్మెల్యే... పత్రికల్లో తమ ఫోటోలు కనిపించాలన్న 'ప్రచార పిచ్చి' వారి పరువు తీసింది. ప్రజా ప్రతినిధులై ఉండి వారు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఉత్తర ప్రదేశ్ లో మహిళా ఎంపీ రేఖా వర్మ, మరో మహిళా ఎమ్మెల్యే కలిసి తమ తమ మద్దతుదారులతో పేదలకు దుప్పట్లు పంచేందుకు సీతాపూర్ ప్రాంతానికి వెళ్లారు. పేదలకు దుప్పట్లు అందించే వేళ, తాను ఫోటోలు దిగుతానంటే, తాను ఫోటోలు దిగాలంటూ ఇద్దరూ గొడవపడ్డారు.

చుట్టూ ప్రజలున్నారన్న సంగతిని మరచిపోయారు. మీడియా ఉందన్న విషయమూ వారికి గుర్తుకు రాలేదు. ఒకరిపై ఒకరు తీవ్ర ఆగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఊగిపోయారు. ఒకరిని ఒకరు తోసుకున్నారు. ఎమ్మెల్యే మద్దతుదారుడిని ఎంపీ కొట్టగా, ఎంపీ మద్దతుదారుడిపై ఎమ్మెల్యే చేయి చేసుకున్నారు. వీరి గొడవ గురించి తెలుసుకున్న కలెక్టర్, పోలీసు అధికారులు అక్కడికి వెళ్లి సర్ది చెప్పి అందరినీ పంపించారు. వీరు గొడవ పడ్డ వీడియో ఇప్పుడు వైరల్. దాన్ని మీరూ చూడండి!

Uttar Pradesh
Sitapur
BJP
Blanket Distribution
  • Error fetching data: Network response was not ok

More Telugu News