Kathi Mahesh: నేను చచ్చిపోవాలా? క్రిటిసిజం ఆపేయాలా? మీరే చెప్పండి.. బరస్ట్ అయిన కత్తి మహేశ్

  • వివాదాన్ని ఆపేందుకు తాను రెడీ అన్న కత్తి
  • తన కుటుంబ సభ్యులను వివాదంలోకి లాగుతున్నారని ఆవేదన
  • తానేం చేయాలో చెప్పాలని డిమాండ్

తనకు, పవన్ ఫ్యాన్స్‌కు మధ్య జరుగుతున్న యుద్ధంపై మాట్లాడుతూ కత్తి మహేశ్ బరస్ట్ అయ్యాడు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. వివాదాన్ని రాజేసింది ఎవరు? ఆపాల్సింది ఎవరని ప్రశ్నించాడు. తాజాగా కత్తి మాట్లాడుతూ.. ఇప్పటి వరకు జరిగిన వ్యవహారంపై ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ఏ పనిచేసినా విమర్శిస్తున్నారని, ఇప్పుడు ఏకంగా తన కుటుంబ సభ్యులను కూడా టార్గెట్ చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నాడు.

‘‘నేనో విమర్శకుడిని, దానిని ఆపేయమంటారా? నేను మనిషిని, జీవించడం ఆపేయమంటారా?’’ అని ప్రశ్నించాడు. చనిపోయి జీవితాన్ని ఆపేయాలా? క్రిటిసిజం ఆపేసి బతుకుదెరువు కోల్పోవాలా? అని నిలదీశాడు. తానేం చేయాలో చెప్పాలని డిమాండ్ చేశాడు.

తాను ఎవరి పైనా వ్యక్తిగతంగా దాడిచేయలేదని, కానీ తనపై మాత్రం అదే జరుగుతోందని కత్తి మహేశ్ ఆవేదన వ్యక్తం చేశాడు. వివాదం ఓ స్థాయికి వచ్చిన తర్వాత మాత్రమే వ్యక్తిగతంగా విమర్శించినట్టు గుర్తు చేశాడు. వివాదం మొదలైన తొలి రోజు నుంచీ దానిని ఆపేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశాడు. అయితే వాళ్లు (పవన్ ఫ్యాన్స్) తనపై ఇంకా దాడిని కొనసాగిస్తూనే ఉన్నారన్నారు. తన కుటుంబ సభ్యులను ట్రాక్ చేసి కామెంట్లతో వేధిస్తున్నారని, చనిపోయిన తన తల్లిని కూడా వివాదంలోకి లాగుతున్నారని కత్తి ఆవేదన వ్యక్తం చేశాడు.

Kathi Mahesh
Pawan Kalyan
Hyderabad
Tollywood
  • Error fetching data: Network response was not ok

More Telugu News