nani: రేపు సర్ప్రైజ్ ఇవ్వనున్న నాని !

  • డ్యూయల్ రోల్‌లో నాని
  • నాని సరసన అనుపమ, రుక్సార్ 
  • పండగ మూడు రోజులూ సర్ప్రైజ్ 

నేచురల్ స్టార్ నాని హీరోగా ప్రస్తుతం 'కృష్ణార్జున యుద్దం' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డబుల్ యాక్షన్ చేస్తున్న నాని సరసన అనుపమ పరమేశ్వరన్, రుక్సార్ మీర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా, నాని ట్వీట్ చేస్తూ, 'ఈ సినిమా తాలూకు సర్ప్రైజ్..' అంటూ పేర్కొన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే, జనవరి 14న ఉదయం 10 గంటలకు ఈ చిత్రంలోని కృష్ణ క్యారెక్టర్ ఫస్ట్ లుక్, జనవరి 15న అర్జున్ క్యారక్టర్ ఫస్ట్ లుక్, జనవరి 16న సినిమాలోని ఫస్ట్ సింగిల్ పాటను రిలీజ్ చేస్తున్నారట.

  • Loading...

More Telugu News